సీఎం చంద్రబాబు స్పీడ్ పెంచారు. పార్టీ, ప్రభుత్వ పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా డిప్యూటీ స్పీకర్, చీఫ్‌విప్, విప్ పదవులను ఖరారు చేశారు.
డిప్యూటీ స్పీకర్‌గా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరు ఖరారు అయ్యింది. ఆయన పేరును సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రేపో మాపో విడుదల కానుంది. బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు ఎన్డీయే పక్ష ఎమ్మెల్యేలు.
రఘురామ కృష్ణరాజు గురించి చెప్పనక్కర్లేదు. ఏమైదా ముక్కుసాటిగా మాట్లాడుతారు. చెప్పాల్సిందే ఓపెన్‌గా చెబుతారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. కొద్దిరోజులకే వైసీపీలో అంతర్గత విబేధాల కారణంగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.
ఈ క్రమంలో రచ్చబండ పేరుతో అప్పటి అధికార పార్టీ అవినీతి, అక్రమాలను తెరపైకి తెచ్చారు. దీనిపై మండిపడిన జగన్ సర్కార్, ఆయనపై ఏకంగా రాజద్రోహం కేసు నమోదు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టింది.
2024 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్న రఘురామకృష్ణరాజు, పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకరవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనుకోకుండా ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది.
చీఫ్ విప్, విప్‌లను నియమించింది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీ చీఫ్ విప్‌గా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ రామాంజనేయులు నియమించారు. ఇక అసెంబ్లీ విప్‌లుగా 15 మంది ఉన్నారు. వారిలో టీడీపీ నుంచి 11 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది.
విప్‌లుగా బీజేపీ నుంచి జమ్ములమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, జనసేన నుంచి కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, నరసాపురం – బొమ్మిడి నారాయణ, తాడేపల్లిగూడెం-శ్రీనివాస్‌లను నియమించారు.
శాసనమండలి చీఫ్ విప్‌గా టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియమించింది ప్రభుత్వం. విప్‌లుగా టీడీపీ నుంచి వేపాడ చిరంజీవిరావు, కంచెర్ల శ్రీకాంత్, జనసేన నుంచి హరిప్రసాద్‌లకు అవకాశం కల్పించింది.