వైసీపీ హార్డ్ నేతలకు కష్టాలు మొదలయ్యాయా? ఆ పార్టీ రూలింగ్‌లో ఉండగా ఇష్టానుసారం రెచ్చిపోయారు. రోజుల ఎప్పుడు ఒకేలా ఉండవన్న విషయాన్ని మరిచిపోయారు. టైమ్ మారింది.. సోమవారం ఫిల్మ్‌మేకర్ ఆర్జీవీ కాగా, లేటెస్ట్ పోసాని కృష్ణమురళి వంతైంది. తూర్పు గోదావరి ఎస్పీకి జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. రేపో మాపో అరెస్ట్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.
సెలబ్రిటీ హోదాలో ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు కొందరు. టీడీపీ అగ్రనేతలు, జనసేన ముఖ్యనేతలను సైతం టార్గెట్ చేశారు. చివరకు వారి కుటుంబసభ్యులను సైతం వదల్లేదు. వ్యక్తిగత విమర్శలతో వారి మనోభావాలతో ఆడుకున్నారు. మానసికంగా క్షోభకు గురి చేశారు.
సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టింగులు పెడుతూ మానసిక ఆనందాన్ని పొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. సోమవారం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. లేటెస్ట్‌గా మరో సెలబ్రిటీ పోసాని వంతైంది.
జనసేన లీగల్ సెల్ నాయకులు వైసీపీ సీనియర్ నేత పోసాని కృష్ణమురళిపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గాంధీ జయంతి నాడు శ్రమదానం చేయాలని కార్యకరక్తలకు పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్‌పై పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నేతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నది ఫిర్యాదులో సారాంశం. గతంలో పోసానిపై నమోదైన కేసు విషయంలో అరెస్ట్ వారెంట్ ఇవ్వవలసిందిగా జనసేన లీగల్ సెల్, కార్యకర్తలు జిల్లా ఎస్పీకి వినతి పత్రాలు ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న కేసు గురించి డీటేల్స్ పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు చెప్పారు.