బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. ఫోన్ ట్యాపింగ్ కేసులో చిరుమర్తి లింగయ్యకు నోటీసులు..

తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలకు నిలువెత్తు నిదర్శనం ఫోన్ ట్యాపింగ్ కేసు. ప్రతిపక్షనేతలు, అధికారుల ఫోన్లు ట్యాప్ చేస్తూ వారికి కదలికలపై గత ప్రభుత్వం నిఘా పెట్టింది. అంతేకాదు.. అనుమానం ఉన్న సొంత మా పార్టీ నేతలు కూడా బాధితుల జాబితాలో ఉన్నారనే వాదన కూడా ఉంది. ఇక్కడితో ఆగినా రకంగా ఉండేది. న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా లోతుగా విచారిస్తే మరిన్ని సంచలనాలు బయటపడే అవకాశం లేకపోలేదు.

 

ఇదిలా ఉంటే.. తాజాాగా.. బీఆర్ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు వెళ్లాయి. విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు పోలీసులు. అయితే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు ఇటీవల అమెరికా గ్రీన్ కార్డు మంజూరు చేసింది. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రభాకర్ రావు డైరెక్షన్‌లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఈ కేసులోని నిందుతులంతా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే.. ముందుగానే ఇదంతా గ్రహించిన ఆయన పక్కా ప్లాన్ చేసి అమెరికాకు పరార్ అయ్యారు. అమెరికాలోని ఉన్న తన కుటుంబ సభ్యుల ద్వారా గ్రీన్‌కార్డుకు అప్లై చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు నుంచే అమెరికాలో సెటిల్ అవ్వడానికి ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఇక కేసు నమోదైన మరుసటి రోజే తిరుపతి మీదుగా చెన్నై వెళ్లి అక్కడి నుంచి ఆయన అమెరికాకు పారిపోయారు.

 

కేసులో ప్రధాన నిందితుడికి అమెరికా గ్రీన్ కార్డు మంజూరు చేయడం విచారణ అధికారులకు ఒకింత తలనొప్పి తప్పదని అనిపిస్తోంది. అయితే.. అధికారులు కూడా ప్లాన్ బీ రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన కార్డుకి ఎప్పుడు అప్లై చేశారు? పర్మిషన్ ఎప్పుడు వచ్చింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు త్వరగా ఇంటర్ పోల్‌‌కు అందించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సీబీఐ సాయం కూడా కోరే అవకాశం ఉంది. మొత్తానికి గ్రీన్ కార్డు మంజూరుతో కేసు విచారణ మరో మలుపు తిరిగిందనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *