ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సమావేశాల తొలిరోజు ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌ను తొలిసారిగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. రూ.2,94,427 కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తెచ్చారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.35 లక్షల కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.32,712 కోట్లుగా పేర్కొన్నారు. వివిధ కీలక శాఖలకు కేటాయించిన నిధులపై ఇప్పుడు చూద్దాం.
వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా..
-రెవెన్యూ లోటు-రూ.34,743 కోట్లు
-ద్రవ్యలోటు-రూ.68,743 కోట్లు
-పాఠశాల విద్య రూ.29,909 కోట్లు
-వ్యవసాయ, అనుబంధ రంగాలు-రూ.11,855 కోట్లు
-ఎస్సీ సంక్షేమం-రూ.7,557
-బీసీ సంక్షేమం-రూ.39,007 కోట్లు
-మైనార్టీల సంక్షేమం-రూ.4,376 కోట్లు
-మహిళ, శిశు సంక్షేమం రూ.4,285 కోట్లు
-ఉన్నత విద్యకు- రూ.2,326 కోట్లు
-జలవనరులు-రూ.16,705 కోట్లు
-ఆరోగ్యం-రూ.18,421 కోట్లు
-పంచాయితీరాజ్, గ్రమీణాభివృద్ధి-రూ.16,739 కోట్లు.
-పట్టణాభివృద్ధి-రూ.11,490 కోట్లు
-గృహ నిర్మాణం-రూ.4012 కోట్లు
-నీటిపారుదల -రూ.16,705 కోట్లు
-పరిశ్రమల వాణిజ్యం-రూ.3,217 కోట్లు
-ద్రవ్యలోటు-రూ.68,743 కోట్లు
-ఇందన రంగం రూ-8,207 కోట్లు
-రోడ్లు, భవనాలకు-రూ.9,554 కోట్లు
-పోలీస్ శాఖకు-రూ.8,495 కోట్లు
-పర్యావరణ, అటవీశాఖకు-రూ.687 కోట్లు