నవంబర్ 11న కదలిరండి కదలిరండి అవినీతిని అంతం చేసేందుకు జంతర్ మంతర్ వద్దకు కదలిరండి- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

ఢిల్లీ : ఢిల్లీలో ఎర్రకోట వద్ద జాతీయ జెండా నినాదాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం గత పాలకుల అవినీతిని అంతం చేసేందుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ మాట్లాడుతున్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని మొండి వైఖరిని అంతం చేసేందుకు నడుం బిగించి ఎర్రకోటలో స్వాతంత్ర సమరయోధుల ఆశయ స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో స్వాతంత్ర సమరయోధుల మెగా పిరమిడ్ నిర్మాణాన్ని నిర్మించాలని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర సమరయోధుల సాహిత్యాన్ని నర నరాల్లోకి అందించాలని త్రివర్ణ మూడు రంగుల జెండాను ఊపుతూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి, మైనంపల్లి హనుమంతరావు గారికి, మధు యాష్ కి గౌడ్ గారికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఫెరోజ్ ఖాన్ గారికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఎక్కడ తగ్గకుండా అష్టదిక్పాలకు లాగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతిపరులకు గుణపాఠం చెప్తూ అభివృద్ధి పథంలో ముందుకెళ్లడం ఎంతో ఆనందదాయకమని అందుకు ఎల్లవేళలా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజా పక్షాన ఉంటానని తెలియజేశారు. ఈ సందర్భంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ కాంటెస్టెడ్ ఎంపీ జి సాయ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర విలువలు తెలుసుకొని నాయకులు, అధికారులు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానీకానికి సంపూర్ణ న్యాయం చేసే దిశలో ముందుకు కొనసాగాలని అందుకు త్రివర్ణ జండా నినాదం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎమ్ అధ్యక్షులు పి.సంగమేశ్వర్, పిరమిడ్ ధ్యాన గురువు బోధన్ సాయిల్ మాస్టర్,తెలంగాణ మహిళా సంఘాల నాయకురాలు పి.ఎఫ్.ఐ చైర్ పర్సన్ నిర్మల రాణి, యువజన సంఘాల నాయకులు శ్రీకాంత్, విద్యార్థులు మరియు వివిధ సంఘాల సంఘసంస్కర్తలు పాల్గొని నవంబర్ 11వ తేదీన జంతర్ మంథర్ వద్ద జరగబోయే సత్యమేవ జయతే మహా పిరమిడ్ ధ్యాన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *