ఫార్ములా ఈ రేసింగ్ నిధులు గోల్‌మాల్.. దూకుడు పెంచిన ఏసీబీ..

గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కొరడా విసురుతోంది. రాష్ట్రంలో జరిగిన పలు స్కాములపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్ల అంశం, లిక్కర్ పాలసీ కేసు ఇలా పలు అంశాలపై గత ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదురుకుంటోంది. వీటిలో లిక్కర్ పాలసీ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కొన్ని నెలల పాటు జైలుకు సైతం వెళ్లి వచ్చారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు రావడంతో కేసీఆర్ ను విచారణకు ఆహ్వానించినప్పటికీ ఆయన వెళ్లలేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుగుతుండగా గత ప్రభుత్వంలో పనిచేసి ఆరోపణలు ఎదురుకున్న అధికారి విదేశాల్లో ఉన్నారు.

 

దీంతో ఈ కేసు ముందుకు వెళ్లడం లేదు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు ఎదురుకుంటున్న మరో అంశం ఫార్ములా ఈ కార్ రేసింగ్. మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. అయితే ఈ కార్ రేసింగ్ పై కూడా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఏసీబీ ఇప్పటికే కేసును విచారిస్తుండగా తాజాగా దూకుడు పెంచి రెగ్యులర్ ఎంక్వయిరీ ప్రారంభించింది. మరో రెండు రోజుల్లో ఆరోపణలు ఎదురుకుంటున్న వారికి నోటీసీలు ఇచ్చి విచారించబోతునట్టు తెలుస్తోంది.

 

ఇదిలా ఉంటే ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించినట్టు గుర్తించారు. కాగా ఇప్పుడు మున్సిపల్ శాఖ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ఆయా విదేశీ సంస్థలు, ప్రతినిధులకు నోటీసీలు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కార్ రేసింగ్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలకు కడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ కేసులో ఎవరెవరికి నోటీసులు అందుతాయి? అవినీతి జరిగినట్టు నిర్దారిస్తే ఎవరెవరు లోపలకు వెళతారనేది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *