మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) .. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్ ‘సినిమా చేసి గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్ర చేసి ప్రేక్షకులను మెప్పించడమే కాదు అంతర్జాతీయంగా పాపులారిటీ అందుకున్నారు. ఈ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ తో ఈయనకు ఏకంగా ఎన్నో సత్కారాలు లభించాయి. ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అంతేకాదు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కూడా రామ్ చరణ్ తో పాటు ఆయన పెట్ డాగ్ రైమ్ తో కలసి వున్న మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే వీరిద్దరికీ సంబంధించిన కొలతలు కూడా అధికారులు తీసుకున్న విషయం తెలిసిందే.
సంక్రాంతికి రాబోతున్న గేమ్ ఛేంజర్..
ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు (Dilraju) నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా నుంచి టీజర్ ను దసరా, దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని తెలిపినా కొన్ని కారణాలవల్ల విడుదల చేయలేకపోయారు. అయితే తాజాగా టీజర్ లాంచ్ తేదీని లాక్ చేసినట్లు తెలిసింది.
నవంబర్ 9న టీజర్ లాంఛ్..
నవంబర్ 9వ తేదీన టీజర్ ను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.దీనిని చాలా గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఉత్తరాది నగరమైన లక్నోలో ఈవెంట్ ప్లాన్ చేసి టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ వేడుకల్లో రామ్ చరణ్ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఐదేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా రాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి అభిమానుల అంచనాలను రాంచరణ్ ఏ విధంగా అందుకుంటారో చూడాలి.
రామ్ చరణ్ కెరియర్..
రామ్ చరణ్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )వారసుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాదు రామ్ చరణ్ నటనకు ఉత్తమ నటుడు విభాగంలో ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది అయితే ఈ సమయంలో చిరంజీవి వల్లే ఈ సినిమా హిట్ అయిందని , అస్సలు ఇతడు హీరో పీసే కాదు అంటూ చాలామంది విమర్శించారు. కానీ ఆ తర్వాత తనలోని టాలెంట్ ను నిరూపించుకోవాలని అనుకున్న రామ్ చరణ్ ఏకంగా రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ సినిమా చేసి ఓవర్ నైట్ కి స్టార్ హీరో అయిపోయారు. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈయన ఒక మోస్తారు గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ దక్కించుకున్నారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమాతో తన రేంజ్ ను ఎంతవరకు పెంచుకుంటారో చూడాలి.