యూనివర్సిటీలపై నమ్మకం కలిగించేలా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి వైస్ ఛాన్సలర్లకు దిశానిర్దేశం చేశారు. నేడు సీఎంతో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల నూతన వైస్ ఛాన్సలర్లు భేటీ అయ్యారు. ఈ సంధర్భంగా సీఎం వారితో మాట్లాడుతూ…కొంత కాలంగా యూనివర్సిటీల పైన నమ్మకం తగ్గుతోందని అన్నారు. యూనివర్సిటీ ల గౌరవాన్ని పెంచాలని ఆదేశించారు. యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలి చేయాలని సూచించారు.
యూనివర్సిటీల ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని చెప్పారు. అవసరమైతే కన్సల్టెన్సీ లను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలని అన్నారు. వైస్ ఛాన్సలర్లకి ఎవరి ప్రభావితంతో పోస్ట్ లు ఇవ్వలేదని, మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగానే వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేసినట్టు స్పష్టం చేశారు. కాబట్టి ఆ బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సో వస్తుందని హెచ్చరించారు. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్ల కి స్వేచ్ఛ ఉంటుందని, ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. యూనివర్సిటీ లను 100 శాతం ప్రక్షాళన చేయాలని, గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. యూనివర్సిటీల్లో మత్తు పదార్థాల విక్రయాల పైన ద్రుష్టి సారించాలని చెప్పారు. అలాంటి అలవాట్లు ఉన్న విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పారు.