‘ఇక లగేజిపై ఫైన్ విధిస్తాం’.. రైల్వేశాఖ కీలక ప్రకటన..

ముంబై నగరంలోని బాంద్రా టర్మినస్ రైల్వే స్టేషన్‌లో రెండు రోజుల క్రితం జరిగిన తొక్కిసలాట ఘటన తరువాత రైల్వే శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే స్టేషన్లలో పరిమితికి మించి లగేజి తీసుకువస్తే.. ప్రయాణికులకు ఫైన్ విధిస్తామని వెస్టరన్ రైల్వే అధికారికంగా ప్రకటించింది. రైలు ప్రయాణంలో ఉచిత లగేజి పరిమితి మించి ప్రయాణికులు తీసుకురావడం కారణంగా కలుగుతున్న అసౌకర్యం, ఇబ్బందులను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం జారీ చేసిన ప్రకటనలో రైల్వే శాఖ పేర్కింది.

 

ప్రతి ప్రయాణికుడు పరిమితి మించి ఉచిత లగేజీ తీసుకొని ప్రయాణం చేయకూడదు. లగేజి పరిమితి దాటితే దానికి ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. పైగా లగేజి కొలతలు 100 cm x 100 cm x 70 cm మించకూడదు. ఒకవేళ లగేజి నిర్ణీత కొలతల కంటే ఎక్కువగా ఉన్నా ప్రయాణికులు ఫైన్ చెల్లించాలి. ముఖ్యంగా కొందరు ప్రయాణికులు తమతో సైకిళ్లు, స్కూటర్లు, ఇతర పెద్ద ఆకారం లగేజితో ప్రయాణం చేయడానికి అనుమతి లేదని వెస్టరన్ రైల్వే తెలిపింది.

 

“ప్రయాణికులందరూ రైల్వే స్టేషన్లలో రద్దీ పరిస్థితులను నివారించడానికి సహకరించాలి. ట్రైన్ షెడ్యూల్ సమయంలో రైల్వే స్టేషన్‌లో ప్రవేశించాలి. ప్రయాణికులు లగేజిని పరిమితి స్థాయిలోనే తీసుకొని రావాలి. ప్లాట్ ఫామ్ పై ప్రయాణికులు సజావుగా కదిలేందుకు ఈ చర్యలు పాటించడం చాలా అవసరం. ప్రయాణికులందరూ ఉచిత లగేజి నియమాలను పాటించాలిన కోరుతున్నాం.

 

ఉచిత లగేజి పరిమితి ఒక్కో క్లాస్ కు వేర్వేరుగా ఉంది. ఉచిత పరిమితికి మించి లగేజి తీసుకువచ్చే ప్రయాణికులకు తప్పకుండా ఫైన్ విధిస్తాం. ఈ నియమాలు వెంటనే అమల్లోకి వస్తాయి. నవంబర్ 8 వరకు స్టేషన్లలో రద్దీ నివారించడానికి ప్రయాణికులు అన్ని నియమాలు పాటించాలి” అని రైల్వే శాఖ తెలిపింది.

 

మరోవైపు దీపావళి, భాయిదూజ్ పండుగల రీత్యా రైల్వే స్టేషన్లలో పార్శిల్ బుకింగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ముంబైలోని బాంద్రా టర్మినస్, వాపి, వల్సాడ్, సూరత్, ఉధ్నా స్టేషన్ల పార్శిస్ కార్యాలయాల్లో బుకింగ్స్ సంఖ్య గణనీయంగా పెరిపోయిందని రైల్వే శాఖ తెలిపింది. ప్లాట్ ఫామ్ పై ఈ పార్శిళ్లు ఉండడంతో ప్యాసింజర్లు సజావుగా స్టేషన్ లో నడిచేందుకు ఇవి అడ్డంగా మారయని.. ప్యాసింజర్ల భద్రతా, సౌకర్యలాను దృష్టిలో ఉంచుకొని.. ట్రైన్ డిపార్చర్ సమయం కంటే ముందుగా చాలా సేపు పార్శిళ్లు ప్లాట్ ఫామ్‌పై ఉంచకూడదని అధికారులకు ఆదేశించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

 

అక్టోబర్ 27, 2024 ఆదివారం రోజున.. ముంబైలోని బాంద్రా టర్మినస్ స్టేషన్లో ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్ కు వెళ్లే అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ లో ఎక్కడానికి దాదాపు వెయి మందికి పైగా ప్రయాణికులు ఒక్కసారిగా ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రయాణికుల కాళ్లు, భుజాలు, వెనెముక భాగాల్లో ఫ్రాక్చర్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

 

దీపావళి పండుగకు స్వగ్రామాలకు వెళ్లాలనే క్రమంలో ప్యాసింజర్లు ఆత్రుతగా ట్రైన్ లో సీటు కోసం పోటీపడడంతో ఈ ఘటన జరిగింది. దీంతో రైల్వే శాఖ నవంబర్ 8 వరకు రైల్వే స్టేషన్లలో రద్దీ సమస్య నివారించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *