ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మహేష్ బాబు..?

రాజకీయ నాయకుడు, పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌ గల్లా ‘హీరో’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. అశోక్‌ నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్‌ జంధ్యాల దర్శకుడు. డివోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మానస వారణాసి నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు.

 

‘హనుమాన్‌’ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రానికి కథను అందించడం విశేషం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో టాలీవుడ్‌ క్రేజీ కథానాయకుడు మహేశ్ బాబు అతిథిగా పాత్ర చేస్తున్నాడని, పతాక సన్నివేశాల్లో వచ్చే శ్రీకృష్ణుడి ఉగ్రస్వరూపం పాత్రకు మహేశ్ సూట్‌ అవుతాడని, ఆయనను ఒప్పించి చిత్రీకరణ చేశారనే వార్త ప్రచారంలో వుంది.

 

అయితే మహేశ్ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నట్టు వస్తున్న వార్తలో నిజం ఉందని, కానీ ఇందుకోసం మహేశ్ చిత్రీకరణలో పాల్గొన్న వార్త మాత్రం నిజం కాదని తెలిసింది. కేవలం సీజీ వర్క్‌, ఇతర సాంకేతిక నైపుణ్యంతో మాత్రమే మహేశ్ ను శ్రీకృష్ణుడిగా చూపించనున్నారని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్‌ జరుగుతోంది. ఇక మహేశ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే చిత్రానికి సంబంధించిన మేకోవర్‌లో ఉన్నాడు. జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *