విద్యుత్ చార్జీలపై దీపావళి పండుగ వేళ శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రంలో దీపావళి పండుగకు ముందే తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలకు శుభవార్త చెప్పింది. విద్యుత్ చార్జీల పెంపు త్వరలో జరగబోతుందని ప్రతిఒక్కరు ఆందోళనతో ఉన్నవేళ పండుగకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏ కేటగిరీలోని విద్యుత్ చార్జీల పెంపు లేదని ఈఆర్సి చైర్మన్ శ్రీ రంగారావు వెల్లడించారు. సామాన్యులకు కాస్త ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే కొన్ని అంశాలలో తీసుకున్న నిర్ణయంతో కొన్ని వర్గాలపై కాస్త భారం పడనుంది.

 

వినియోగదారులకు భారీ ఉరట

డిస్కంల ప్రతిపాదనలను సోమవారం ఇ ఆర్ సి తిరస్కరించడంతో వినియోగదారులకు భారీ ఉరట లభించింది. మొత్తం ఎనిమిది వందల యూనిట్లు దాటితే ఫిక్స్డ్ చార్జీలు ₹10 నుంచి 50 రూపాయలకు పెంచాలని డిస్కమ్ ల ప్రతిపాదనలను కమిషన్ ఆమోదించలేదు. ఈరోజు ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగా రావు మీడియాతో మాట్లాడుతూ మొత్తం ఎనిమిది పిటిషన్ల పైన కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని పేర్కొన్నారు.

 

విద్యుత్ చార్జీలు ఏ కేటగిరీలోనూ పెంచడం లేదన్న ఈఆర్సీ చైర్మన్

అన్ని పిటిషన్ల పైన ఎటువంటి లాప్స్ లేకుండా నిర్ణయం వెల్లడించాలని నిర్ణయించిందని తెలిపారు. మొత్తం అన్ని పిటిషన్లపై 40 రోజుల తక్కువ సమయంలోనే నిర్ణయం వెల్లడి చేస్తున్నామని పేర్కొన్న ఆయన విద్యుత్ చార్జీలు ఏ కేటగిరీలోనూ పెంచడం లేదని తెలిపారు. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

 

స్థిరచార్జీలు ₹10 గా ఉంటుందని వెల్లడి

విద్యుత్ చార్జీలు పెంపు లేదని పేర్కొని స్థిరచార్జీలు ₹10 గా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇక పౌల్ట్రీ ఫార్మ్, గోట్ ఫాం లపై విద్యుత్ చార్జీల పెంపు100 రూపాయలు పెంచాలన్న ప్రతిపాదనను కమిషన్ ఆమోదించలేదని తెలిపారు. హెచ్ టి కేటగిరీలో ప్రతిపాదనలు తిరస్కరించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే 132 కే వి, 133 కెవి, 11 కెవి లలో చార్జీలు ఉంటాయని వెల్లడించారు.

 

నాన్ పీక్ అవర్ లో రూపాయి నుంచి రూపాయి 50 పైసలు పెంచనున్నట్టు వెల్లడి

టైం ఆఫ్ డే లో పీక్ అవర్ లో ఎటువంటి మార్పు లేదని, రాత్రి పది గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నాన్ పీక్ అవర్ లో రూపాయి నుంచి రూపాయి 50 పైసలు పెంచనున్నట్టు శ్రీ రంగారావు వెల్లడించారు. గృహ వినియోగదారులకు మినిమం చార్జీలు తొలగించామని, గ్రిడ్జ్ సపోర్ట్ చార్జీలు కమిషన్ ఆమోదించిందని పేర్కొన్నారు శ్రీ రంగారావు.

 

లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 250 ఫిక్స్డ్ చార్జీల పెంపు

ఇక బస్సు, రైల్వే కి సంబంధించిన వాటిని కూడా పెంచలేదని, లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 250 ఫిక్స్డ్ చార్జీలను పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. చేనేత హెచ్పీ టెన్ నుంచి హెచ్ పి 20 కి పెంచనున్నట్టు, డొమెస్టిక్ కేటగిరి 1 హార్టికల్చర్ వంటి వాటిని 15 hp నుండి 20 హెచ్ పి కి పెంచనున్నామని తెలిపారు. ఇక ఈ చార్జీలు సవరింపుతో వినియోగదారులపై ఐదు నెల కాలానికి 30 కోట్ల భారం పడుతుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *