బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా పుష్ప-2 సరికొత్త రికార్డు..

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కలయికలో సినిమా అనగానే అందరిలో ఆసక్తి వుంటుంది. ఇంతకు ముందు ఈ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు సక్సెస్‌ సాధించడమే ఇందుకు కారణం. ఈ ఇద్దరి జోడీ పుష్ప ది రైజ్‌ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న మరో చిత్రం పుష్ప-2 ది రూల్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

 

ముఖ్యంగా ఇండియాలో అత్యధిక మంది వెయిట్‌ చేస్తున్న క్రేజీయస్ట్‌ ఫిలింగా కూడా పుష్ప-2 ది రూల్‌ను అభివర్ణిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 5న వరల్‌వైడ్‌గా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు నిర్మాతలు. ఇటీవల జరిగిన ఈ చిత్రం ప్రెస్‌మీట్‌లో ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు ఈ సినిమా వసూళ్లు ఎలా వుండబోతున్నాయో, వసూళ్ల పరంగా పుష్ప-2 సాధించబోయే రికార్డుల గురించి కూడా ఈ సమావేశంలో మాట్లాడారు.

 

ఈ చిత్రాన్ని బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమాగా కూడా చెబుతున్నాయి ట్రేడ్‌ సర్కిళ్లు. ప్రపంచవ్యాప్తంగా పుష్స-2 చిత్రాన్ని ఆరు భాషల్లో కలిపి 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేస్తుండగా, అందులో ఓవర్సీస్‌లో 5000 వేల స్క్రీన్స్‌, ఇండియాలో 6500 స్క్రీన్స్‌లో విడుదల కాబోతున్నట్లుగా ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా నిర్మాతలు తెలియజేశారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా ఇలాంటి ఘనత సాధించలేదని అంటున్నాయి ఇండియన్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌.

 

తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, ఒరిస్సా భాషల్లో పుష్ప-2 ది రూల్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, రావు రమేష్‌, అనసూయ భరద్వాజ్‌, జగపతిబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తుండగా, పోలెండ్‌ కెమెరామెన్‌ కూబా డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *