ఎన్ని అవాంతరాలు ఎదురైనా మూసీని హన్ నదిలా మారుస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సౌత్ కొరియా రాజధాని సియోల్ లో తెలంగాణ మంత్రుల పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నగరంలో మెరుగైన నీటి సరఫరా, స్వచ్ఛమైన పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు హన్ నది చాలా కీలకంగా మారింది. దాని పునరుజ్జీవన ప్రాజెక్టును తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పరిశీలించింది. మొదట్లో అది కూడా మూసీలాగా కాలుష్యకారకంగా ఉండేది. పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టాక నగరానికి ముఖ్యమైన జలవనరుగా మారడమేగాక పర్యాటకంగానూ అభివృద్ధి చెందింది.
రెండో రోజు పర్యటనలో భాగంగా హన్ రివర్ బోర్డు డిప్యూటీ మేయర్ జో యంగ్ టీ మరియు సంబంధిత బోర్డు డైరెక్టర్లతో మంగళవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య మరియు తెలంగాణ ప్రతినిధుల బృందం పాల్గొన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
హన్ నదికి రెండు దిశలా పాత్ ల కోసం 78 కి.మీ. నిర్మించబడిది. సందర్శకుల కోసం అందమైన చెట్లు ఆకర్షించేలా ఏర్పాటు చేశారు. రోజుకు లక్ష ఎనభై వేల మంది సందర్శిస్తుంటారు. హన్ నది పునరుజ్జీవం తర్వాత నగరం రూపురేఖలు మారిపోయాయి. నదికి రెండు వైపులా షాపింగ్ కాంప్లెక్సులు కూడా ఉన్నాయి. గ్లోబల్ సిటీ పోటీలో సియోల్ ప్రపంచంలోనే 7వ స్థానంలో ఉందని అన్నారు. మూసీని కూడా ఎన్ని అవాంతరాలు ఎదురైనా హన్ నదిలా అభివృద్ధి చేస్తామని అన్నారు.