పుష్ప 2 షూటింగ్ పెండింగ్.. మళ్ళీ వాయిదా కన్ఫర్మ్..?

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప 2 మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫాన్స్ గత కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నారు .ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామని ఫాన్స్ ఆసక్తి కనపరుస్తున్నారు. అయితే ఈ సినిమాను ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ముందుగా పుష్ప 2 టీమ్ అనౌన్స్ చేశారు. అయితే షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడం వల్ల వాయిదా పడింది. మళ్లీ ఈ సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు మరో డేట్ ను ప్రకటించారు. రిలీజ్ కు కేవలం ఒక నెల మాత్రమే ఉండటంతో ఈ సినిమాకు ప్రమోషన్స్ గట్టిగా చేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికానందున మేకర్స్ కూడా సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది. అదేంటంటే.. పుష్ప 2 మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఓ వార్త షికారు చేస్తుంది. అందులో నిజం ఎంతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

 

పుష్ప 2 షూటింగ్ ఇంకా పెండింగ్..

 

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2.. ఈ సినిమాకు లెక్కలు మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.. గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పుష్ప నేషనల్ వైడ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకోవడంతో పాటుగా.. భారీ కలెక్షన్స్ను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ సినిమా మిగిలిన స్టోరీని సెకండ్ పార్ట్ లో చూపించాబోతున్నట్లు సుకుమార్ చెప్పారు. ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15 న రిలీజ్ చెయ్యాలని మేకర్స్ అనుకున్న కొంత పార్ట్ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. ఇక ఇప్పుడేమో డిసెంబర్ 6 న రిలీజ్ అనుకున్నా కూడా షూటింగ్ ఇంకా నవంబర్ నెలకు కూడా పూర్తి అయ్యేలా కనిపించలేదు. ఇక పెద్ద సినిమా కావడంతో ప్రమోషన్స్ కు ఒక 20 రోజులు అన్నా కేటాయించాలి. మరి షూటింగ్ ను ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి..

 

మళ్ళీ వాయిదా పడనుందా?

 

పుష్ప 2 షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందని వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మేకర్స్ ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు కానీ అప్పుడప్పుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది నవంబర్ నెలకి కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపించట్లేదని ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. సుకుమార్ డైరెక్షన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో తెలిసిందే.. సినిమా రిలీజ్ అయ్యే ఆఖరి నిమిషం వరకు సుకుమార్ సినిమాకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. పెద్ద సినిమా కాబట్టి ఆ మాత్రం తప్పదంటాడు సుకుమార్… టాకి పార్ట్ తో పాటుగా, సాంగ్స్ పెండింగ్ ఉన్నాయి. నిజానికి ఈ సినిమాను అక్టోబర్ కు పూర్తి చెయ్యాలను ప్లాన్ చేసారు. కానీ నవంబర్ వరకు పడుతుందని, బడ్జెట్ కూడా పెంచినట్లు మొన్నీమధ్య చెప్పాడు. ఇప్పుడు ఏమో మరో వారం పెరిగే అవకాశాలు ఉన్నట్లు తాజా సమాచారం. అంటే ప్రమోషన్స్ కు టైం కావాలి. అందుకే డిసెంబర్ లాస్ట్ వీక్ లో సినిమా రావచ్చు అని టాక్.. ఇదంతా చూస్తుంటే సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. సుక్కు పైన మొత్తం ఉంది. మరి సుక్కు ఎలా ప్లాన్ చేస్తాడో.. అనుకున్న టైం కు సినిమాను తీసుకొని వస్తాడో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *