బీజేపీ నేతల బూతు వీడియోల వ్యవహారంలో ఏం జరుగుతోంది? ఒకే జిల్లాలో రెండు అంశాలు తెరపైకి రావడం వెనుక ఎవరున్నారు? వీటిని బయట పెట్టిందెవరు? పార్టీ నేతల హస్తముందా? ఎందుకు కొందరు నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఇరుక్కున్నారా? ఇదే చర్చ ఇప్పుడు ఆ పార్టీలో మొదలైపోయింది.
ఏపీ బీజేపీ నేతల్లో బూతు వీడియోల వ్యవహారంపై రచ్చ మొదలైంది. ఇప్పటికే గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కాగా, మరొకరు మాజీ అధ్యక్షుడు రామకృష్ణకు చెందిన వీడియోలు తెగ హంగామా చేస్తోంది. వీడియోల వ్యవహారంపై ఆ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంతకీ వీటిని బయటపెట్టిందెవరు? ఆ మహిళలకు పార్టీలకు ఏమైందా సంబంధం ఉందా? అనేది అసలు చర్చ.
వీడియోకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నది రామకృష్ణ వెర్షన్. మార్ఫింగ్ చేశారని ఆరోపించారాయన. వనమా నరేంద్ర మాత్రం తన వీడియోకి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నెక్ట్స్ ఎవరనేది ఆ పార్టీలో చిన్నపాటి చర్చ మొదలైపోయింది. వీడియోలు లీకేజీ వెనుక కొంతమంది నేతలు ఉన్నారనే వాదన లేకపోలేదు.
వరుసగా బీజేపీ నేతలకు సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో అవి నిజమైనవా? పార్టీని దెబ్బతీయాలని ఎవరైనా ప్లాన్ చేశారా? అనేది తెలియక నేతలతోపాటు కార్యకర్తలు సతమతమవు తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని రామకృష్ణ చెబుతున్నారు. కానీ, నరేంద్ర నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు.
ఈ వీడియోలపై నిగ్గు తేల్చాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పార్టీ మరింత డ్యామేజ్ అవుతుందన్నది కార్యకర్తల ఆవేదన, ఆందోళన. వీటికి ఎవరు బయటకు లీక్ చేశారన్నదానిపై ఆ పార్టీ నేతల్లో అప్పుడే చర్చ మొదలైపోయింది.