ఢీ సీక్వెల్‌ శ్రీనువైట్ల ఎందుకు చేయడం లేదో తెలుసా..?

విజయవంతమైన చిత్రాలకు సీక్వెల్స్‌ తెరకెక్కించడం అనేది టాలీవుడ్‌లో ఇప్పుడు జోరందుకుంది. కొత్త కథల అన్వేషణ, క్యారెక్టర్స్‌ సృష్టి ఇవన్నీ కష్టతరమైన ఈ తరుణంలో నేటి దర్శకులకు తమ సినిమాలకు సీక్వెల్స్‌ చేయడమనేది మంచి ప్రత్యామ్నాయంలా కనిపిస్తుంది. ఇదే కోవలోనే తన దర్శకత్వంలో తెరకెక్కిన ఢీ చిత్రానికి అప్పట్లో సీక్వెల్‌ చేద్డామని శ్రీనువైట్ల అనుకున్నారు. మంచు విష్ణు, శ్రీహరి, జెనీలియా, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించింది.

 

పూర్తి వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని బాగా ఆదరించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చిత్రానికి సీక్వెల్‌ చేసే ఆలోచన లేదని శ్రీనువైట్ల అంటున్నారు.

 

ఆయన మాట్లాడుతూ… “ఢీ చిత్రంలో నటించిన శ్రీహరి మరణించడం వల్ల నా దృష్టిలో ఆయన పాత్రను ఎవరూ రీప్లేస్ చేయలేరు. అందుకే సీక్వెల్‌ను పక్కన పెట్టేశాను. ఢీ-2 చిత్రంను చేయాలనే ఆలోచన నాకు లేదు. కాకపోతే ఆ చిత్రానికి మించిన వినోదాత్మక చిత్రాలను అందించే ప్రయత్నంలో ఉన్నాను. త్వరలోనే విడుదల కానున్న నా చిత్రం ‘విశ్వం’లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ అందర్ని అలరిస్తుంది” అన్నారు.

 

అయితే టాలీవుడ్‌లో మాత్రం ఢీ-2 చిత్రాన్ని మంచు విష్ణు మరో దర్శకుడితో చేసే ఆలోచనలో ఉన్నారనే వార్త ప్రచారంలో వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *