నాగచైతన్య, హీరోయిన్ సమంతలు విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..

టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతలు విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో కేటీఆర్‌నుద్దేశించి మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. హీరోయిన్లకు మత్తు మందు ఇచ్చి, రేవ్‌ పార్టీల్లో ఎంజాయ్‌ చేసేవారంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలంటూ కేటీఆర్ తన టీమ్‌కు చెప్పారని విమర్శించారు. రాజకీయ విలువలు దిగజారిపోయాయని మంత్రి ధ్వజమెత్తారు. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి నడుపుతున్నారన్నారు.

 

హరీష్ రావు మనసున్న మనిషిగా కొండా సురేఖ చెప్పారు. దొంగ ఏడుపులు అవసరం లేదన్నారు. కొంతమంది హీరోయిన్ల తొందరగా పెళ్లి చేసుకొని సినీ పరిశ్రమకు దూరమయ్యారని ఆరోపించారు. నామీద ట్రోలింగ్ చేస్తే ఎవరూ రియాక్ట్ కాలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *