శ్రీరామ కళామందిరం విఘ్నేశ్వరుడి ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శ్రీరామ కళామందిరం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్నేశ్వరుని ఉత్సవాల్లో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరునికి శాలువాతో సన్మానించి ఆ యొక్క గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసే ప్రతి కార్యంలో విజయాన్ని ప్రార్థించాలని తెలియజేశారు అదేవిధంగా శ్రీరామ కళామందిరం ఆలయ కమిటీ భక్త బృందం వారికి శాలువాతో ఘనంగా సత్కరించి గణనాథుని వేడుకలను సాంప్రదాయ బద్దంగా భజన, భజంత్రీలతో సాంస్కృతిని తెలియడం నేటి తరానికి ఎంతో ఆనందదాయకమని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో సదాశివపేట మాజీమున్సిపల్ వైస్ చైర్మన్ తోట చంద్రశేఖర్ పటేల్, మున్సిపల్ కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథము, మాజీకౌన్సిలర్ చీల మల్లన్న, శ్రీరామ కళామందిరం ఆలయ సేవకులు రవీంద్రనాథ్ గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *