జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..

ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, కన్నడ సినిమాలకు కూడా తన డాన్స్ తో అలరించారు. ఇండస్ట్రీలో అందరు అగ్ర హీరోలతో స్టెప్పులు వేయించారాయన. ఇప్పటికి టాలీవుడ్, కోలీవుడ్‌లో , కన్నడ చిత్రసీమలో స్టోరీతో పాట ఉంటే ఆ సాంగ్‌కు

కొరియోగ్రాఫర్‌గా ఇంక ఎవరు వద్దని మాకు జానీ మాస్టర్ కావాలని దర్శకులు ఫావరేట్ గా అడుగుతారు. అంతసెంటిమెంట్ స్టెప్పులతో కూడా పండిస్తారాయన. అందుకే అంత గొప్ప డాన్స్ మాస్టర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో 70వ జాతీయ చలన చిత్ర పురష్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు అందుకున్నారు.

 

ఇక కెరీర్ సాఫీగా సాగుతున్న వేళ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు కేసు నమోదైంది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్.. లైంగిక దాడి చేస్తున్నారంటూ 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. ఔట్ డోర్ షూటింగ్స్ లలో తనపై అత్యాచారం చేశాడంటూ రాయ్ దుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది. దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయ్ దుర్గం పోలీసులు.. నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి ట్రాన్స్ ఫర్ చేసినట్టు సమాచారం.

 

గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీమ్ లో కొరియోగ్రాఫర్ గా చేస్తున్నా అని బాధిత యువతి చెబుతోంది. చెన్నై, ముంబై లలో ఔట్ డోర్ షూటింగ్స్ లతో పాటు.. హైదరాబాద్ నార్సింగ్ లోని తన ఇంటి లో సైతం.. జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని వాపోతుంది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ పై మూడు సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

 

సెక్షన్ 376, సెక్షన్ 506, 323 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు నార్సింగ్ పోలీసులు వెల్లడించారు. అలానే ఇదే విషయంపై విమెన్ సేఫ్టీ వింగ్ డిజీ షికా గోయల్‌ని.. పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం కలిసినట్టు చర్చ జరుగుతోంది. 2019 లో సైతం జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *