భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్యనితిక్ మహాధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపిన- బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నవంబర్ 10, 11వ తేదీన నిర్వహించే మహా ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపిన-భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్యనితిక్ అధ్యక్షులు మహేంద్రముఖ్య.

ఉత్తర ప్రదేశ్, గ్రేటర్ నోయిడా వద్ద భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్యనితిక్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై నిర్వహించిన మహాధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపి ధర్నాకు హాజరైన బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రైతులు లేనిది దేశం లేదని అలాంటి రైతుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించి రైతాంగాన్ని కాపాడుకోవాలని రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలియజేశారు. అదేవిధంగా భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్యనితిక్ అధ్యక్షులు మహేంద్రముఖ్య గారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ఈ దేశంలో స్వతంత్ర సమరయోధులు కన్న కలలు, ఆశయాలు నెరవేరిన రోజునే దేశానికి మరియు రాష్ట్రాలకు అదేవిధంగా రైతాంగాన్ని కాపాడుతున్న రైతులకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అని కొనియాడారు. ధర్నాలో భాగంగా మద్దతు తెలిపిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ కాంటెస్టెడ్ ఎంపీ సాయ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సోమరులుగా, అవినీతిపరులుగా తయారుచేసిందని ఇట్టి నేపథ్యంలో స్వాతంత్ర సమరయోధుల విలువలు తెలియకుండా ప్రభుత్వ యంత్రాంగం మూర్ఖత్వంగా వ్యవహరించిందని అందుకు మూర్ఖత్వంతో వ్యవహరించిన ఛాయాచిత్రాలను, పత్రికా నివేదికలను మరియు సంబంధిత ఆధారాలను దృష్టిలో ఉంచుకొని నవంబర్ 10,11న న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే మహా ధర్నాకు అన్ని ఉద్యమ సంఘాల, బీసీ సంఘాల, అన్ని రాజకీయ పార్టీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుండి స్వతంత్ర సమరయోధుల విలువలతో పోరాడుతున్న రైతులు నవంబర్ 10,11న జంతర్మంతర్ వద్ద జరగబోయే మహా ధర్నాకు సంపూర్ణ మద్దతు ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్యనీతిక్ అధ్యక్షులు మహేంద్రముఖ్య గారు తెలియజేశారు. ఈ యొక్క భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్యనితిక్ మహాధర్నా కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *