అక్కినేని నాగార్జున ప్రస్తుతం.. తన ఫంథాను మార్చుకుంటున్నాడు. హీరోగానే కాకుండా సపోర్టివ్ రోల్స్ లో కూడా నటించడం మొదలుపెట్టాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ధనుష్- రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగ్.. ఒక ఐటీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక గత కొన్నిరోజులుగా నాగార్జున.. రజినీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రంలో విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రంలో రజినీతో పాటు స్టార్ హీరోస్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. నాగ్ లాంటి హీరో.. రజినీకి విలన్ గా నటించడం ఏంటి అని అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇంకొంతమంది .. హీరో అంటే అన్ని పాత్రలు చేయాలి .. అలా చేస్తే ఇంకా ఫ్యాన్ బేస్ ను పెంచుకోవచ్చు అని చెప్పుకొచ్చారు.
ఇక ఇవన్నీ పుకార్లే కాబట్టి.. ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. అయితే నాగ్ బర్త్ డే సందర్భంగా ఆ పుకార్లను నిజం చేస్తూ.. కూలీ సినిమా నుంచి నాగ్ పోస్టర్ ను మేకర్స్ అధికారికంగా రివీల్ చేస్తూ బర్త్ డే విషెస్ ను తెలిపారు. సైమన్ అనే పాత్రలో నాగ్ నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సైమన్ గా నాగ్ లుక్ అదిరిపోయింది.
స్టైలిష్ లుక్ లో నాగ్ కనిపించి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక నాగ్ కూడా ఈ సినిమాలో జాయిన్ అవ్వడంతో సినిమాపై తెలుగు అభిమానుల్లో కూడా అంచనాలను మొదలయ్యాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నాగ్ కోలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.