కోల్ కతా డాక్టర్ ఘటనలో.. తెరపైకి మరో కొత్త పేరు..

కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల.. కాదేది కవితకు అనర్హం అన్నాడు ఆరోజుల్లో మహాకవి శ్రీశ్రీ.. కానీ ఇప్పుడు ఈ లైన్స్‌ను కాస్త మార్చేసి.. చెత్తబుట్ట, ఆడపిల్ల, హత్యాచారం.. కాదేది రాజకీయానికి అనర్హం అంటున్నారు ఇప్పటి రాజకీయ నేతలు.. ఇది నిజంగా నిజం.. మీరు నమ్మకపోతే ఓసారి కోల్‌కతా హత్యాచారానికి సంబంధించి న్యూస్ చూడండి.. రెండు రోజులుగా కోల్‌కతా అట్టుడుకుతోంది. లాఠీచార్జ్, టియర్ గ్యాస్‌, బ్యారికెడ్లు, వాటర్ కెనాన్స్.. ఇలా కోల్‌కతా వీధుల్లో ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. ఎందుకిదంతా అంటే.. కోల్‌కతా హత్యాచార బాధితురాలికి న్యాయం చేయడం కోసం.. ఇదే ఇప్పుడు అస్సలు అర్థం కావడం లేదు.. తనకు న్యాయం జరగాలని కోరుకుంటోంటి.. సీబీఐ విచారణ జరుపుతోంది. సామాన్యుడి నుంచి ప్రధాని వరకు అంతా నేరస్థులను తీవ్రంగా శిక్ష పడాలని కోరుకుంటున్నారు ఆఖరికి అత్యున్నత న్యాయస్థానం కూడా ఎప్పటికప్పుడు విచారణ జరుపుతోంది. అయినా ఉన్నట్టుండి ఓ అలజడి.. అదే ఇప్పుడు బెంగాల్‌ను కుదిపేస్తుంది.

 

నిజానికి మమతా బెనర్జీ హత్యాచార ఘటనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేకపోయినందుకు హోంమినిస్టర్‌గా ఉన్న మమతా బెనర్జీని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారా? లేక ఆరోగ్యశాఖ మంత్రి అయిన మమతా బెనర్జీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారా? లేక రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగినా ఏం చేయలేకపోతున్నారని సీఎం మమతా ఏం చేయలేకపోతున్నారని ర్యాలీ చేశారా? బెంగాల్‌ సీఎం, హోంమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి అన్ని మమతా బెనర్జీనే.. మళ్లీ ఆమే ర్యాలీ తీయడమే పెద్ద వండర్.. ఇది అసలు నిసిగ్గు వ్యవహారం.. సరే పోనీలేండి ఇదంతా పాత విషయమే.. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. కానీ చీమకుకూడా హాని జరగలేదు.. చాలా పకడ్బంధీగా పోలీస్‌ వ్యవస్థ పనిచేసింది.

కానీ ఆ తర్వాత జరిగిన ర్యాలీలన్నింటిలో జరిగింది హింసాకాండే.

 

ఆర్‌జీ కర్‌ హాస్పిటల్‌లో దారుణానికి వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. అదే సమయంలో హాస్పిటల్‌లోకి చొరబడ్డ అల్లరిమూక.. నానా బీభత్సం సృష్టించింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని మొత్తం ధ్వంసం చేశారు. తరువాత.. నబన్నా అభియాన్.. అంటే చలో సచివాలయం పేరుతో కోల్‌కతాలో ఓ ర్యాలీ నిర్వహించారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ జరిగింది. ఇది ఎంత హింసాత్మకంగా మారిందంటే.. చాలా మంది నిరసనకారులు గాయపడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకొని బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇది కూడా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. వీధుల్లో బీజేపీ, తృణమూల్‌ కార్యకర్తలు తన్నుకున్నారు. బీజేపీ నేతలపై దాడులు జరిగాయి.. కాల్పులు జరిగాయి. కొన్ని చోట్లు బాంబులు కూడా పేలాయి. మమతా బెనర్జీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఏం చేసినా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు.

 

మమతా బెనర్జీ ర్యాలీ చేస్తే ప్రశాంతంగా సాగిపోవడం ఏంటి..? వేరే ఎవ్వరూ ర్యాలీకి దిగిన ఈ దాడులు.. అరాచకం నిద్రలేవడం ఏంటన్నది అస్సలు అర్థం కావడం లేదు. ఓ వైపు ఇలాంటి ఘటనలు రోజుకోకటి జరుగుతుంటే.. మరోవైపు తాను కూడా మద్దతిస్తున్నాను అన్నట్టుగా ఒక్కో నిర్ణయం తీసుకుంటున్నారు. ఆమె లెటెస్ట్‌గా ఓ ట్వీట్ చేశారు. టీఎంసీ పార్టీ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవాన్ని ట్రైనీ డాక్టర్‌కు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలని జుట్టు పీక్కుంటున్నారు బెంగాల్ ప్రజలు.. ఆమె గవర్నమెంట్‌పై ఆమె నిరసన తెలపడం ఏంటో.. ఆమెకు వ్యతిరేకంగా గొంతెత్తిన విద్యార్థులను, నిరసనకారులను చితకబాదడం ఏంటో.. ఆమెకే తెలియాలి. మొత్తానికి సీబీఐ విచారణను డైవర్ట్ చేసే వాతావరణం క్రియేట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు..

 

టీఎంసీ నేతలను ఇదే ప్రశ్న వేస్తే.. ప్రస్తుతం విచారణ కేంద్రం చేతిలో ఉంది కదా అంటున్నారు. కాబట్టి.. విచారణ సీబీఐ జరుపుతుంది కాబట్టి.. మాకేం సంబంధం లేదన్నట్టుగా ఉంది బెంగాల్ ప్రభుత్వ వ్యవహార తీరు. ఇప్పటికైనా ఈ పనికిమాలిన రాజకీయాలను పక్కన పెట్టి అసలు వ్యవహారంపై ఫోకస్ చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. కానీ పట్టించుకునేవారు ఎవరు. అధికారపక్షమైనా.. విపక్షమైనా.. ఎవరి పంచాయతీల్లో వారే ఉన్నారు. ఎవరి పొలిటికల్ గెయిన్‌లో వారే ఉన్నారు.

 

ఇక సీబీఐ ఇన్వెస్టిగేషన్ విషయానికి వద్దాం..ఈ కేసులో ఇప్పుడు మరో కొత్త పేరు వినపడింది. అతనే ASI అనూప్ దత్తా.. ఎవరీ అనూప్ దత్తా అనే కదా మీ డౌట్.. మొన్న ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌కు సీబీఐ పాలిగ్రాఫ్‌ టెస్ట్ నిర్వహించిన సమయంలో ఈ పేరు తెరపైకి వచ్చింది. ఈ అనూప్‌, సంజయ్ మధ్య చాలా మంచి ఫ్రెండ్‌ షిప్‌ ఉంది. ఇంకా.. హత్యాచారం తర్వాత కూడా సంజయ్‌ అనూప్‌ను కలిసేందుకు వెళ్లాడు. ఈ అనూప్‌ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌ ఘోష్‌కు చాలా క్లోజ్ అని సీబీఐ గుర్తించింది. సంజయ్ పోలీస్ క్వార్టర్స్‌లో ఉండటానికి, పోలీస్ వెహికల్‌ను ఉపయోగించుకోవడానికి కూడా అనూపే కారణమని విచారణలో తేలింది. దీంతో అనూప్‌పై ఫోకస్ చేసింది సీబీఐ.. మరి అతడిని కూడా విచారిస్తుందా? అతడికి కూడా పాలిగ్రాఫ్‌ టెస్ట్ నిర్వహిస్తుందా? అనేది చూడాలి.. అంతేగాక మొత్తానికి బెంగాల్‌ ప్రజలతో పాటు.. దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తోంది న్యాయం కోసం.. మీ పనికి మాలిన రాజకీయం కాదని పాలకులు ఎప్పుడూ తెలుసుకుంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *