పీక్ లెవెల్ పుష్ప క్లైమాక్స్..?

అభిమానులంతా మొన్న ఆగస్టు 15న పుష్ప 2 వస్తుందని ఎంతగానో ఆశపడ్డారు. కనీసం అప్ డేట్ కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. తొలి భాగం సృష్టించిన కలెక్షన్ల ప్రభంజనం, జాతీయ స్థాయి ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ఆ పురస్కారాన్ని అందుకోవడం..ఒక్కసారిగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హోదాని అందుకోవడం అన్నీ పుష్ప తొలి భాగంతోనే మొదలయ్యాయి. దీనితో పుష్ప 2 మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. డిసెంబర్ 6న పుష్ప 2 విడుదల కాబోతోందని మేకర్స్ చెప్పారు.

 

హైప్ తెచ్చిన కామెంట్స్

 

పుష్ప తొలి భాగం విడుదలయ్యాక అల్లు అర్జున్ పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లడం తగ్గించేశాడు. సొంత మెగా ఫ్యామిలీ హీరోలకు కూడా వెళ్లడం లేదు. అయితే ఇటీవల అల్లు అర్జున్ ఓ మూవీకి సంబంధించిన ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఇదే వేదికపై బన్నీ పుష్ప 2 గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సాధారణంగా ఇప్పటిదాకా తాను నటించిన ఏ సినిమా గురించి ముందుగా ఎక్కువ చేసి చెప్పలేదు. కానీ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న పుష్ప 2 గురించి చెప్పక తప్పడం లేదన్నారు. తాను ఇప్పటిదాకా నటించిన చిత్రాలు ఒక ఎత్తు..పుష్ప 2 ఇంకో ఎత్తు. ఈ

 

ఊహించని క్లైమాక్స్

 

మూవీ తర్వాత అంతా పుష్ప 2 పతాక సన్నివేశాల గురించే చర్చించుకుంటారన్నారు. సుకుమార్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా మలుచుకుంటారు. ఆయనకు జనం నాడి బాగా తెలుసు. నా లైఫ్ లో ఇలాంటి క్లైమాక్స్ ఎక్కడా చూడలేదు. చూసే ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. మీరు ఊహించని క్లైమాక్స్ ..ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని సుకుమార్ చిత్రీకరించారు. క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. ఇక ముందు కూడా పుష్ప ఫ్రాంచైజీ ఇలాగే కొనసాగుతుందని బన్నీ అన్నారు. అంటే పుష్ప 3 కూడా ఉండబోతోందని పరోక్షంగా హింట్ ఇచ్చేశాడు బన్నీ.

 

ఫ్యాన్స్ పండుగ

 

పతాక సన్నివేశాల చిత్రీకరణ ఎంతో డిఫికల్ట్ గా ఉండనుందని..నా అభిమానులే కాదు ఆడియన్స్ కూడా ఎంతో థ్రిల్ కు గురవుతారని అన్నారు. అయితే ఇప్పటిదాకా పుష్ప 2కి ఆలస్యం అయిందని గుర్రుగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ బన్నీ కామెంట్స్ విని పండగ చేసుకుంటున్నారు. సాధారణంగా బన్నీ తన సినిమాల గురించి ఈ రేంజ్ లో ఏనాడూ మాట్లాడలేదని..ఇప్పుడు ప్రత్యేకంగా చెబుతున్నాడంటే తప్పకుండా పుష్ప 2 లో విషయం ఉన్నట్లే అని భావిస్తున్నారు. పైగా పుష్ప ఫ్రాంచైజీ కొనసాగుతుందని చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేవు. అయితే ఈ మూవీపై కొందరు పనిగట్టుకుని ట్రోలింగులు చేస్తున్నారు.

 

నెగెటివ్ కామెంట్స్ కు చెక్

 

ఈ మూవీలో విషయం లేదు కాబట్టే ఇప్పటిదాకా ఆలస్యం అవుతూందని కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఈ మూవీకి మార్కెట్ అవ్వలేదని ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్లందరికీ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ తో నోళ్లు మూతపడ్డాయి. ఒక్క సారిగా మూవీపై అంచనాలు డబుల్ గా మారాయి. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్ బస్టర్ లో నెంబర్ వన్ గా కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *