సీఎం రేవంత్ ప్రతిపాదన, ఇవాళ సింఘ్వి నామినేషన్..

రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున అభషేన్ మనుసింఘ్వి సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సింఘ్వి నామినేషన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.

 

ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నానక్ రామ్‌గూడలోని ఓ హోటల్‌లో సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశమయ్యింది. దీనికి పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, అభిషేన్ మనుసింఘ్వీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. సింఘ్విని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేశారు.

 

అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర పునర్ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల్లో అనేక అవాంతరాలు ఉత్పన్నం అయ్యాయని అన్నారు. ఈ చట్టాన్ని కేంద్రం సరిగా అమలు చేయ లేదని, దీనిపై రాజ్యసభతోపాటు సుప్రీంకోర్టు బలంగా వినిపించేందుకు సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానాన్ని కోరామని తెలిపారు. సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ సీఎల్పీ తీర్మానం చేసింది.

 

అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. విభజన, జల వివాదాల అంశాలపై బలంగా తన వాదనను వినిపిస్తారని గుర్తు చేశారు. తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి ఉపయోగపడుతారని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేన్ మనుసింఘ్వి మాట్లాడారు. వారసత్వ సంస్కృతికి నెలవైన నూతన తెలంగాణ కోసం బలమైన గళం రాజ్యసభలో వినిపిస్తానని హామీ ఇచ్చారు.

 

యువత, రైతులు, ఇలా మీరు ప్రస్తావించే విషయాలపై ఢిల్లీలో మీ బలమైన మద్దతుదారునిగా లేవనెత్తుతాన్నారు. సోమవారం ఉదయం 11గంటలకు శాసనసభ కార్యాలయంలో ఆయన దాఖలు చేయను న్నారు. సింఘ్వి నామినేషన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *