టీటీడీలో గత పాలకమండలి అధికారంలో ఉన్న సమయంలో అనేక అక్రమాలు జరిగాయని, ఆ అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో గత ఆరు నెలల కాలంలో సుమారు రూ. 100 కోట్లకు పైగా చేతులు మారాయని, వాటిపైన విచారణ జరిపించాలని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనవి చేశారు.
ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ గత వైసీపీ ప్రభుత్వంపై, గత టీటీడీ పాలక మండలిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. శ్రీవారి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను గత టీటీడీ పాలక మండలి దుర్వినియోగం చేసిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు, గత పాలకమండలి టీటీడీ సత్రాలు నిర్మించడానికి రూ. 1200 కోట్లు కాంట్రాక్టు ప్రైవేట్ సంస్థకు అప్పగించిందని చింతా మోహన్ గుర్తు చేశారు.
ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చారని, అందులో రూ. 100 కోట్లకు పైగా చేతులు మారాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. దేవుడి మీద భక్తితో తిరుమలకు చేరుకున్న భక్తులు శ్రీవారి హుండీలో కానుకలు సమర్పిస్తారని, ఆ హుండీ డబ్బులను గత పాలకమండలి దుర్వినియోగం చేసిందని, ప్రజల మనోభావాలతో పడుకున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ గత టీటీడీ పాలక మండలి తీరుప మండిపడ్డారు.
తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను గత వైసీపీ ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి అపవిత్రం చేసిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మండిపడ్డారు. తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన అగ్నిప్రమాదంపై తనకు చాలా అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఆంధ్రప్రదేశ్ప్రభుత్వానికి మనవి చేశారు.