దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని.. వైఎస్ జగన్ కు వాణి విజ్ఞప్తి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ పతి, పత్ని, ఔర్ వో కహానీలో తాజాగా ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు ఆస్తులు ఇస్తే చాలు, విడాకులు ఇస్తే చాలు అని మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి నా భర్త నాకు కావాలంటూ రచ్చ మొదలుపెట్టారు.

 

దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణ హాని

దువ్వాడ శ్రీనివాస్ కు మాధురి చేతిలో ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు, తన భర్తకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ కొత్త ఇంట్లో నిన్న రాత్రి మాధురి వచ్చి ఉన్నట్టు తనకు అనుమానం కలుగుతుందని పోలీసులు ఇల్లంతా తనిఖీ చేయాలని ఆరోపణలు చేశారు. తన తన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాధురి బారినుండి దువ్వాడ శ్రీనివాస్ ను కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

పదిరోజులుగా కారు షెడ్ లోనే వాణి, పిల్లలు

దువ్వాడ శ్రీనివాస్ పూర్తిగా మాధురి ట్రాప్ లో ఉన్నాడని, పేర్కొన్న వాణి గత పది రోజులుగా తాను తన పిల్లలు కారు షెడ్ లోనే ఉంటున్నామని, తమకు ఇంట్లోకి వెళ్లడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దువ్వాడ శ్రీనివాస్ భార్యగా తనకు ఆ ఇంట్లోకి వెళ్లడానికి సర్వహక్కులు ఉన్నాయని దువ్వాడ వాణి పేర్కొన్నారు.

 

తన భర్త ఇంటి నుండి అనధికార వ్యక్తులను బయటకు పంపాలి

శ్రీనివాస్ కు ఏదైనా జరిగితే తాను తన పిల్లలు వీధిన పడతామని దువ్వాడ వాణి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులు స్పందించి దువ్వాడ శ్రీనివాస్ నివాసంలో ఉన్న అనధికార వ్యక్తులను బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో తాను లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించిన దువ్వాడ వాణి, తమ కుటుంబ సమస్యను పరిష్కరించడానికి పార్టీ అయినా దృష్టి సారించాలన్నారు.

 

జగన్ చొరవ చూపాలి

వైసిపి అధినేత జగన్ తమ కుటుంబ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని దువ్వాడ వాణి విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించుకోవాలని దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ సూచనలు చేయాలని వాణి కోరుతున్నారు. తాము గత పది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా, ఇంటి బయటే ఉంటున్నా, ఏం చెప్తున్నా పట్టనట్టు దువ్వాడ శ్రీనివాస్ ప్రవర్తిస్తున్నాడని, మాధురి వల్లే ఇదంతా అని దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *