తెలంగాణ రాష్ట్ర ప్రజలకు78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో సిద్దాపూర్ గ్రామంలో ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ 78వ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, దైవ స్వరూపులుగా శ్రీశ్రీశ్రీ శ్రీవిద్య ఉపాసకులు సంజీవ్ మహారాజ్ హాజరై ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకొని మూడు రంగుల త్రివర్ణ జాతీయ జెండాను ఎగరవేశారు. స్వాతంత్ర సమరయోధులను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటుచేసిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆశయాలు నెరవేరాలని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను సంపూర్ణంగా ఆశీర్వదించారు. తదనంతరం స్వాతంత్ర సమరయోధులను దృష్టిలో ఉంచుకొని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్రం చాలా విలువైందని అట్టి స్వాతంత్రాన్ని స్వతంత్ర సమరయోధులు ప్రాణ త్యాగాలు లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసి 11 నెలల జైలు శిక్ష అనుభవించిన వారిలో కీర్తిశేషులు కోవూరి మొగలయ్య గౌడ్ ఒకరని కొడియాడుతూ స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడం కోసం స్వతంత్ర సమరయోధుడు కోవూరి మొగలయ్య గౌడ్ కు కేటాయించిన పదెకరాల స్థలంలో ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రక్షణ కవచం లాగా పనిచేస్తుందని తెలియజేశారు. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను పక్కకు పెట్టిన బంగ్లాదేశ్లో రోజురోజుకు అరాచకాలు, మానభంగాలు, హత్యలు మరియు చావు బతుకులతో అక్కడి ప్రజలు స్వాతంత్రాన్ని కోల్పోయినట్టుగా జీవిస్తున్నారు అని తెలియజేస్తూ బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటనలను గుర్తు ఉంచుకొని అలాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వాటిల్లకుండా అందరు కలిసి కట్టుగా స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో అందరూ నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, విద్యార్థిని,విద్యార్థులు, గురువులు,ఆధ్యాత్మిక వేత్తలు అందరూ ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆశయాలను నెరవేర్చడంలో భాగస్వాములై అభివృద్ధి పతంలో ముందుకు నడవాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి సంఘప్ప గౌడ్, అడ్వకేట్ వై.భగవంతరావు గౌడ్,మద్దికుంట వెంకటరెడ్డి మహారాజ్, పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రచారక అధ్యక్షులు కరాటే మాస్టర్ అశోక్, పిరమిడ్ మాస్టర్ కృష్ణ, డాక్టర్ సంధ్య, సంగమేశ్వర్ మరియు స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం పోరాడే తెలంగాణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *