ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్య కళాశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి కోటా సీట్ల కేటాయింపుపై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్యూఎస్ కోటా సీట్లు కేటాయింపు జీవోను నిలిపివేస్తూ మంగళవారం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీట్ల కేటాయింపులు జీవోను సవాలు చేస్తూ మెడికల్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ చేపట్టింది. సీట్లు పెంచకుండా ఈడబ్యూఎస్ కోటా క్రింద సీట్లు కేటాయిస్తే ఓపెన్ కేటగిరీలో విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. వెంటనే ఈజీవోను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
మెడికల్ సీట్లను పెంచి ఈడబ్యూస్ క్రింద సీట్లు ఇవ్వాలని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్ వాదలనను అంగీకరించిన కోర్టు జీవోను నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఆరు వారాలకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.