రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వారివి

రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వారివి.. కూలీ నాలీ చేసుకుంటే కానీ పూట గడవని పరిస్థితి. కరోనా కారణంగా విందించిన లాక్ డౌన్ వారికి శాపంగా మారింది. నేడు రోజువారి కూలీపనికి వచ్చి పనులు లేకపోవడంతో తిరిగి ఉట్టి చేతులతో ఇంటికి వెళ్తున్న అడ్డా కూలీల పరిస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా కారణంగా రోజువారి కూలిపనులు చేసుకునే వారి పరిస్దితి దయనీయంగా మారింది. పది దాటితే పోలీస్ సైరన్ మోగే పరిస్దితి వుండటంతో, తెల్లవారుజామున నాల్గు గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకొని పనుల కోసం తమ అడ్డాల వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. ముఠా మేస్త్రి పనులు చేయించుకోవాడనికి కూలీలను ఎంపిక చేసుకుంటే.. ఆ రోజు మూడు పూటల తిండి దొరుకుతుంది, లేకపోతే ఆ రోజు ఆ కుటుంబమంతా పస్తులు వుండాల్సిన పరిస్దితి నెలకొందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ మనం చూస్తున్న వీరంతా రోజువారి కూలీలు. ప్రతీ రోజు ఉదయాన్నే అడ్డా మీదకు వచ్చి అక్కడి నుంచి భవన నిర్మాణాలకు.. లేదా ఇతర కూలీ పనులకు వెళ్తుంటారు. ఐతే, ప్రభుత్వం విదించిన లాక్‌డౌన్ కారణంగా రోజువారి కూలీలకు ఉపాది కరువైంది. ప్రతీ రోజు ఉదయాన్నె లాక్‌డౌన్ సడలింపు టైంలో అడ్డాకు వచ్చి.. పది గంటల వరకు నిరీక్షించి పనులు దొరక్క తిరిగి ఇంటి బాట పడుతున్నారు. పస్తులుంటున్నారు.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల కుటుంబాలు కూలీ వృత్తిపై ఆధారపడి ఉన్నాయి. వారంతా ఇప్పుడు కూలీ పనులు దొరకకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవన నిర్మాణాలు చేసుకునే వారి ఇంటికి కూలి పనికి వెళ్లేందుకు పోలీసులు గుర్తింపు కార్డులు ఇవ్వాలని రోజువారి కూలీలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *