‘NBK 109’ లో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే పవర్ ఫుల్ సీన్ అదేనాట..!

బాలయ్య బాబు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వరుస సినిమాలతో బిజీ బిజీ సమయాన్ని గడుపుతున్నాడు. గతేడాది భగవంత్ కేసరితో ప్రేక్షకుల మందుకు వచ్చి అదరగొట్టేశాడు. ఇందులో ఫుల్ మాస్ యాక్షన్ పాత్ర చేసి దుమ్ము దులిపేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సైతం రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో పవర్ ఫుల్ సినిమా చేస్తున్నాడు. ఇది వరకు ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో ఇప్పుడొక మూవీలో నటిస్తున్నాడు.

 

ఈ చిత్రం ‘NBK 109’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ లెవల్లే తెరకెక్కిస్తున్నాడు. బాలయ్య అభిమానులు కోరుకున్న విధంగానే ఇందులో బాలయ్యను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత నాగవంశీ, సౌజన్య కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అంచనాలు ఓ రేంజ్‌లో పెంచేశాయి. ముఖ్యంగా గతంలో రిలీజ్ అయిన గ్లింప్స్‌లో బాలయ్య ఊరమాస్ యాక్షన్ చూసిన అభిమానులు ఈ సినిమా పక్కా హిట్ అంటూ ఫిక్స్ అయిపోయారు.

 

ఆ గ్లింప్స్‌లో బాలయ్య ఊచకోత ఓ రేంజ్‌లో ఉంది. విలన్‌లను వేటాడుతున్న తీరు అబ్బో అదిరిపోయిందనే చెప్పాలి. అతడి డైలాగ్ డెలివరీ, స్వాగ్ అంతా దుమ్ము రేగిపోయింది. ఈ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ సినిమా తాజా షెడ్యూల్ జైపూర్‌లో పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో బాలయ్య పాల్గొన్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. జైపూర్‌లో తాజాగా ఫైట్ సీన్స్ షూటింగ్ పూర్తయిందని తెలిపాడు. బాలయ్య ఎప్పుడూ ఒకే ఎనర్జీతో ఉంటారని.. మోస్ట్ పవర్‌ఫుల్ సీన్లలో బాలయ్య ఆవేశాన్ని చూసేందుకు రెడీగా ఉండాలని తెలిపాడు. ఈ మేరకు అతి త్వరలో ఈ సినిమా టైటిల్‌ను వెల్లడిస్తామని చెప్పుకొచ్చాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *