ఒక ఫ్రేమ్‌లో ప్రధాని మోదీ-రాహుల్..!

ప్రధాని నరేంద్రమోదీ- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గురించి చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ భిన్న ధృవాలు. పార్లమెంటు సమావేశాల్లో ఇద్దరు నేతలు ఒక ఫ్రేమ్‌లో కనిపించడం రేర్. కానీ ఇద్దరు నేతలు పక్కపక్కనే కూర్చుని మాట్లాడితే దాన్ని వర్ణించలేము. చెప్పడం కంటే చూడటమే బెటర్.

 

శుక్రవారం పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. సోమవారం వరకు సమయం ఉండగానే ముందుగానే ముగిశాయి. అయితే పార్లమెంట్ ఆవరణంలో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. స్పీకర్ ఓం బిర్లా తన ఛాంబర్‌లో అధికార-విపక్ష నేతలు ఛాయ్‌కి పిలిచారు. దీనికి ప్రధాని నరేంద్రమోదీ-ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీలను మిగతా నేతలు హాజరయ్యారు.

 

ప్రధాని నరేంద్రమోదీ- ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పక్కపక్కనే కూర్చొన్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నవ్వుతూ కాసేపు మాట్లాడుకున్నారు. సోఫాలో కూర్చొన్న ప్రధాని మోదీకి కుడివైపు స్పీకర్ ఓం బిర్లా, తర్వాత రాహుల్‌గాంధీ కూర్చున్నారు.

 

కేంద్రమంత్రులు కిరణ్, రిజిజు, రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, కనిమొళి కూర్చొన్నారు. పీయూష్ గోయల్, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి నేతలు ప్రధానికి ఎడమవైపు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఈ తరహా సన్నివేశం చాన్నాళ్లు తర్వాత కనిపించిందని ఎంపీలు చెప్పుకోవడం గమనార్హం. చాయ్ సమయంలో ఏం కబుర్లు చెప్పుకున్నారనేది టాప్ సీక్రెట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *