సీఎం రేవంత్ టీమ్ వివిధ కంపెనీలతో ఒప్పందాలు.అమెరికా టూర్ దాదాపు సక్సెస్..!

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా టూర్ దాదాపు సక్సెస్ అయ్యిం ది. తెలంగాణ అభివృద్ధి‌లో భాగస్వామ్యానికి ప్రపంచబ్యాంక్ సంసిద్ధత వ్యక్తంచేసింది. అంతేకాదు ప్రపంచ బ్యాంకుతో కలిసి తెలంగాణ పని చేయాలని నిర్ణయించుకోవడం ఇదే తొలిసారి.

 

అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌‌రెడ్డి బుధవారం ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యే కంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై గంటసేపు చర్చించారు. రాష్ట్రంలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన రోడ్ మ్యాప్ వివరించారు. తెలంగాణతోపాటు హైదరాబాద్ అభివృద్ధికి రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న తీరు మంచి ఫలితాలు వస్తాయని ప్రపంచబ్యాంక్ ఆశాభావం వ్యక్తంచేసింది.

 

నెట్ జీరో సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి చూపిన చొరవపై ప్రపంచబ్యాంక్ ఆసక్తి కనబరిచింది. సమగ్ర సమతుల్య అభివృద్ధికి తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న తీరును ప్రపంచబ్యాంక్ ప్రశంసించింది. మూసీ నది పునరుజ్జీవనం, నైపుణ్య యూనివర్సిటీ, హైదరాబాద్‌లో మరో సిటీ ఏర్పాటును ప్రోత్సహించింది.

 

ప్రాంతాల వారీగా చేపట్టనున్న ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు వాటి అమలును వేగంవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిఫుణులతో బృందాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను ప్రపంచబ్యాంకుతో సీఎం రేవంత్ పంచుకున్నారు.

 

మరోవైపు సీఎం రేవంత్ టీమ్ వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. మెటీరియల్‌ సైన్స్‌ సెక్టార్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్నింగ్ ఇన్‌కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు ముందుకొచ్చింది. ఫార్మా, కెమికల్ రంగాలలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ది కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో కార్నింగ్‌ భాగస్వామిగా పని చేయనుంది.

తెలంగాణలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పటంపై చర్చలు జరిపారు. వచ్చే ఏడాది నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమిస్తామని ప్రకటించింది. అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్‌లను ఉపయోగిస్తా రు. వీటి తయారీకి వినూత్నమైన వెలాసిటీ గ్లాస్-కోటింగ్ టెక్నాలజీని ఈ కంపెనీ వినియోగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *