ఏపీ వాసులకు శుభవార్త. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జన్మభూమి-2ను త్వరలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. నైపుణ్య గణనను దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఉంటుందని అందులో పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.