న్యూఢిల్లీ, ప్రధానమంత్రి కార్యాలయం నుండి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడం కోసం భారతదేశ ప్రధానమంత్రి గారి ఓ.ఎస్.డి ని కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ అభివృద్ధి పనులకు 108 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంలగా పనిచేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, హెల్త్ అండ్ మెడికల్ క్యాబినెట్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ గారు, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు ఈ ఐదేళ్ల పరిపాలనలో చరిత్ర గుర్తించదగ్గ విధంగా స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతారని అదేవిధంగా దేశభక్తి భావంతో మెదులుతున్న భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మరియు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన చొరవ తీసుకొని స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చుటకు ముందుండి తెలంగాణ ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ అభివృద్ధి సాధించుటలో భాగంగా ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆశయాలకు అండగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రంగా ఉండే విధంగా సహాయ సహకారాలను అందిస్తారని తెలియజేశారు. ఇట్టి తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వాతంత్ర సమరయోధులు కన్న కలలను నెరవేర్చుటకు అందరూ పేరుపేరునా భాగస్వాములై సహకరించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేను మరియు ఎంపీ ని ప్రత్యేకంగా కలిసి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు ఏ విధంగా తోడ్పడుతున్నారో త్వరలోనే ఎప్పటికప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ యొక్క ప్రజాక్షేత్రానికి తెలియజేస్తామని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.శివకుమార్, బీసీ రక్షక్దళ్ చైర్మన్ ఎం ఉదయ్ కుమార్, మరియు స్వాతంత్ర సమరయోధుడి ఆశయాల కోసం పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధిక సంఖ్యలో న్యూఢిల్లీ ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించారు.