సీఎం రేవంత్‌తో ఆనంద్ మహీంద్ర భేటీ.. పెట్టుబడులు, స్కిల్ యూనివర్సిటీపై చర్చ..

సీఎం రేవంత్‌రెడ్డితో బిజినెస్‌మేన్ మహీంద్రా గ్రూప్ కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు ఇరువురు మధ్య సమావేశం జరిగింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆయన అంగీకరించారు.

 

ప్రస్తుతం హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు మహీంద్రా గ్రూప్ కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చ సుధీర్ఘంగా చర్చ జరిగింది.

 

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు అంగీకరించారు ఆనంద్ మహీంద్రా. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిశీలనకు తమ టీమ్‌ను పంపుతామ ని తెలిపారు. దీనికితోడు హైదరాబా‌లో క్లబ్ మహీంద్రా హాలీడే రిసార్ట్ విస్తరణకు ముందుకు వచ్చారు ఆనంద్ మహీంద్రా.

 

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావరణం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి.. ఆనంద్ మహీంద్రాకు వివరించారు. రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయని ఆయన కితాబు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *