విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా కోవిడ్ బాధితుల సంఖ్య 52కు చేరుకుంది. కోవిడ్‌తో జమలమ్మ అనే అటెండర్ మృతి చెందింది. జమలమ్మ మృతితో ఇంద్రకీలాద్రి పై మృతుల సంఖ్య మూడుకు చేరింది. సోమవారం ఇద్దరు అర్చకులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజుల క్రితం కోవిడ్‌తో అర్చకుడు మృతి చెందగా.. మరొక అర్చకుని పరిస్ధితి విషమంగా మారింది. ఇంద్రకీలాద్రిపై కఠిన ఆంక్షలు విధించారు. దర్శన వేళలను అధికారులు కుదించారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు దుర్గమ్మ దర్శనం లభించనుంది. అమ్మవారికి నిర్వహించే అన్ని సేవలతో పాటు పంచహారతులను ఏకాంతంగా నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. కోవిడ్ కేసుల తీవ్రతతో ఉద్యోగులు, అర్చకుల్లో మరింత భయాందోళనలు పెరుగుతున్నాయి. ఆలయంలో విధులు నిర్వహించాలంటేనే అర్చకులు, ఉద్యోగులు వణికిపోతున్నారు.