మనం సినిమాలో రెండు నిముషాలు కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు అఖిల్ అక్కినేని. క్లైమాక్స్‌లో అఖిల్ ఎంట్రీ అదిరిపోయింది. దర్శకుడు విక్రం కుమార్ క్లైమాక్స్ సీన్స్‌లో అఖిల్‌ని చూపించిన విధానానికి.. ఇక హీరో ఎంట్రీ ఇచ్చేయాల్సిందే అని మాట్లాడుకున్నారు. అనుకున్నట్టుగానే అఖిల్ డెబ్యూ సినిమా అఖిల్ పేరుతోనే ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా యంగ్ హీరో నితిన్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ రివీలైంది. రచయిత వెలిగొండ శ్రీనివాస్.. వాస్తవంగా అఖిల్ కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని దృష్ఠిలో పెట్టుకొని తయారు చేశాడట. అప్పటికే చరణ్‌కి స్టార్ ఇమేజ్ వచ్చి భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అందుకే డిఫ్రెంట్ కథాంశాన్ని వెలిగొండ శ్రీనివాస్ చరణ్ కోసం సిద్దం చేసినట్టు తెలిపాడు. కానీ అనూహ్యంగా ఈ కథ అఖిల్ డెబ్యూ సినిమాగా చేయాల్సి రావడంతో లాంచింగ్ ప్రోజెక్ట్ కాబట్టి ముందు అనుకున్న కథలో అఖిల్‌కి సరిపడేలా కథలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందట. అఖిల్ డెబ్యూ సినిమా రిజల్ట్ తేడా కొట్టడానికి అదే పెద్ద కారణం అయిందని రచయిత లిగొండ శ్రీనివాస్ వెల్లడించారు. లేదంటే గ్యారెంటీగా అఖిల్ డెబ్యూ సినిమాతో డీసెంట్ హిట్ దక్కించుకునేవాడేననమాట.