కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. అయితే ఈ మూవీ నిడివి చాలా ఎక్కువగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా సినీ ప్రియులు తెలియజేశారు. దీనిపై స్పందించిన చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 నిమిషాల నిడివి గల పలు దృశ్యాలను తొలగించింది. దీంతో ప్రస్తుతం ఈ సినిమా సుమారు 2 గంటల 40 నిమిషాల నిడివితో ప్రసారమవుతోంది.