మాస్ మహరాజా రవితేజ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ సిద్ధమైందని, రవితేజతో చర్చలు నడుస్తున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. రవితేజ ‘పవర్’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు బాబీ. కాగా, ప్రస్తుతం ఆయన బాలకృష్ణ మూవీతో బిజీగా ఉన్నారు.