పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఆయన ఈ మూవీపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ‘ఓజీ’ రిలీజ్‌కు నిర్మాతలు కొత్త డేట్ కోసం చూస్తున్నారని చెప్పాడు. అలాగే తను పవన్‌తో కాంబినేషన్ సీన్స్ ఇంకా చేయాల్సి ఉందని అవి క్రేజీ లెవెల్లో ఉంటాయని ఇమ్రాన్ తెలిపాడు.