తనను ప్రేమించి మోసం చేశాడంటూ నటుడు రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్య.. ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ శుక్రవారం అర్ధరాత్రి తన అడ్వకేట్‌కు సందేశం పంపారు. తాను వెళ్లిపోతున్నానంటూ అందులో పేర్కొన్నారు. దీంతో అడ్వకేట్ నార్సింగి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ‘నేనేంటో తెలిసిన వారే నన్ను తప్పుబట్టారు. రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేను, బతకలేను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.