విశ్వ క్రీడలు అంటే ప్రతీ ఆటగాడికా సంబరమే. ఆ మహాక్రీడోత్సవంలో పాల్గొనడమే పతకం గెలిచినంత ఆనందాన్ని ఇస్తుంది. ప్రపంచలోని అన్ని క్రీడలకు సంబంధించి పోటీలకు ఒలంపిక్స్ వేదికగా నిలుస్తున్నది. కానీ కొన్ని పాపులర్ ఆటలకు మాత్రం ఒలంపిక్స్‌లో చోటు లేకుండా పోయింది. గతంలో ఆడిన క్రీడలను కూడా తప్పించేశారు. ఆయా ఆటలు సుదీర్ఘంగా జరగడమో లేదా వాటి కోసం ప్రత్యేకమైన స్టేడియంలు నిర్మించాల్సి రావడం వల్ల కొన్నింటిని అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ దూరంగా పెట్టింది. అలాంటి క్రీడలేవో ఒకసారి పరిశీలిద్దాం.