ఉమ్మడి నల్గొండ జిల్లాలో సెకండ్ వేవ్ కరోనా మరింత వేగంగా విజృంభిస్తోంది. కరోనాతో నిన్న ముగ్గురు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 810 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నల్గొండ జిల్లాలో 250, సూర్యాపేట జిల్లాలో 145, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 415 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.