: ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను కొవిడ్ టెస్టుల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కో-ఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్ గుర్నాథానికి కూడా కరోనా టెస్టులు చేయించినట్లు పోలీసులు తెలిపారు. గుర్నాథానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఏ1గా ధూళిపాళ్ల నరేంద్ర, ఏ2గా గోపాలకృష్ణ, ఏ3గా గుర్నాథం ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ధూళిపాళ్ల నరేంద్రకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది. విజయవాడ జిల్లా జైలుకు ధూళిపాళ్ల నరేంద్రను తరలించారు.