ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ, బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం అధికారులను ఆదేశించారు. కుటుంబ సర్వేల ద్వారా గుర్తించిన 32వేల మందికి పరీక్షల నిర్వహణ వెంటనే పూర్తి చేయాలని సీఎం తెలిపారు. కరోనా బీమా కిందకు వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.