ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2829 AD’ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించగా.. తాజా సమాచారం ప్రకారం విడుదల తేదీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల కారణంగా జూన్ 20వ తేదీకి మార్చినట్లు సినీ వర్గాలు సమాచారం. దీనిపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *