గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు. జూబ్లీహిల్స్ లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆమెతో పాటు మరికొందరు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం.