పవన్ కళ్యాణ్‌కు నిరసన సెగ..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తోంది. టికెట్ దక్కని నేతలు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. గతంలో విశాఖ సౌత్ సీటు వంశీకే అన్నట్లు పవన్ హామీ ఇచ్చారు. దాంతో వంశీ నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించి ప్రచారం కూడా చేపట్టారు. కానీ చివరి నిమిషంలోనూ జనసేన జాబితాలో వంశీ పేరు కనిపించలేదు. దాంతో వంశీ వర్గీయులు ఆందోళనకు దిగారు. అందుకే విశాఖ సౌత్ సీటు పెండింగ్‌లో పెట్టారనే చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *