తెలంగాణలో 8,180 గ్రూప్-4 భర్తీలో రోస్టర్ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త రోస్టర్ విధానం, మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్‌సైటులో పొందుపరిచారు. గతంలో విధించిన రోస్టర్ విధానాన్ని ఉపసంహరించారు. ఏ జిల్లాలో ఏ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలు దక్కుతాయనే వివరాలను విడుదల చేశారు. మరిన్ని వివరాలకు https://websitenew.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో చూడండి.