ఏపీ ఎన్నికల్లో ప్రచారం కు సిద్ధమైన తెలంగాణ బీసీవై పార్టీ కమిటీతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంసిద్ధంగా ఉన్న- బీసీవై పార్టీసంగారెడ్డి నియోజకవర్గము ఇన్చార్జిన్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్..

విజయవాడ, మంగళగిరి బీసీవై పార్టీ జాతీయ కార్యాలయంలో తెలంగాణ బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన ప్రముఖ నాయకులతో భేటీ అయిన జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారు.ఇట్టి సమావేశంలో బీసీవై పార్టీసంగారెడ్డి నియోజకవర్గము ఇన్చార్జిన్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీవై పార్టీ జెండా ఎగరవేయడానికి,బీసీవై పార్టీని విస్తృతంగా బలోపేతం చేయడానికి,ప్రజల గుండెల్లో వెలుగులు నింపడానికి బిసివై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో అహర్నిశలు పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీవై పార్టీ జండా ఎగరవేస్తామని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ బీసీవై పార్టీ కమిటి ప్రముఖ నాయకుల సమక్షంలో జాతీయ బీసీ వై పార్టీ కార్యాలయంలో తెలియజేశారు.ఈ యొక్క సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వివిధ నియోజకవర్గాల ప్రముఖ నాయకులు రాజు గౌడ్,సురేష్ యాదవ్, బుచ్చిరెడ్డి, ఎర్రారం దేవదాస్, ఎర్రగోల్ల జై కుమార్, సాయి కృష్ణ యాదవ్, యాదగిరి, పర్వత సురేష్, మరియు తదితర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *